ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 200 మంది ప్రయాణికుల పడిగాపులు

by Kema Shiva Kumar |

విమానాల్లో సాంకేతిక లోపాలు సర్వసాధారణమైపోయాయి.

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. 200 మంది ప్రయాణికుల పడిగాపులు
X

దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో సాంకేతిక లోపాలు సర్వసాధారణమైపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం రాత్రి సింగపూర్‌కు బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో 200 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోయింగ్ 787-9 డ్రీమ్‌ లైనర్ విమానంలో ప్రయాణికులు కూర్చొని బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా.. ఫ్లైట్‌లో ఏసీ సిస్టమ్, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తింది. దీంతో ఫ్లైట్ క్రూ 2 గంటలు శ్రమించినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానం నుంచి ప్రయాణికులను కిందకు దింపి తిరిగి టర్మినల్‌కు పంపారు. ఇక చేసేదేమి లేక వారంతా ఆల్టర్‌నేట్ ఫ్లైట్ కోసం ఎయిర్‌‌పోర్టులోనే పడిగాపులు కాశారు.

Next Story