ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చైనా గగనతలం నుంచి వెనక్కి

by Ramesh Naini |

ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం (AI173) సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంది.

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చైనా గగనతలం నుంచి వెనక్కి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం (AI173) సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. సుమారు 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బోయింగ్ 777-300 ER రకానికి చెందిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

చైనా గగనతలం నుంచే వెనక్కి

‘ఫ్లైట్ రాడార్ 24’ సమాచారం ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన 3 గంటల తర్వాత, చైనా గగనతలంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తంగా 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించి విమానం దిల్లీలో ల్యాండ్ అయింది. ఎయిరిండియా భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రస్తుతం విమానానికి ముమ్మర సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటనపై ఎయిరిండియా సంస్థ స్పందిస్తూ.. ‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. గ్రౌండ్ సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన రీషెడ్యూలింగ్, హోటల్ వసతి, ఆహార సదుపాయాలు అందిస్తున్నారు. వారిని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.’ అని వెల్లడించారు.

Next Story