- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India Boeing : మరో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం
యావత్ దేశాన్ని కుదుపేసిన గుజరాత్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) విషాదం మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : యావత్ దేశాన్ని కుదుపేసిన గుజరాత్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) విషాదం మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నుంచి ఢిల్లీ(Zurich to Delhi)కి రావాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్-787(Air India Boeing 787) విమానంలో సాంకేతిక సమస్యలు(Technical Issues) తలెత్తడంతో దానిని జ్యూరిచ్ ఎయిర్ పోర్టులోనే నిలిపి వేశారు. ఈ సమస్యను విమానం టేకాఫ్‌కు కొద్ది నిముషాల ముందు గుర్తించడంతో, ప్రయాణికులను సురక్షితంగా దించి, విమానం సాంకేతిక లోపాన్ని సరి చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సాంకేతిక లోపం వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఇంజిన్, ఫ్లాప్స్, లేదా ఇతర కీలక వ్యవస్థలతో సంబంధం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విమానం బయలుదేరడానికి మరింత సమయం పట్టవచ్చునని ఎయిర్ పోర్ట్ నిర్వహకులు పేర్కొన్నారు. కాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (విమానం AI-171) టేకాఫ్ సమయంలో కుప్పకూలి 270 మంది మరణించిన సంగతి తెలిసిందే.






