అదుపుతప్పిన పరిస్థితి.. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం

by Gantepaka Srikanth |

అదుపుతప్పిన పరిస్థితి.. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం

అదుపుతప్పిన పరిస్థితి.. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌(Nepal)లో మరోసారి జెన్-జీ(Gen Z) ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. యూత్ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. సిమారా ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలు బంద్ చేసింది. ఎక్కువ మంది ఒక చోట చేరడంపై నిషేధం విధించింది. అయినా.. ఆందోళనలు ఆపకపోవడంతో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇటీవల నేపాల్‌లో జన్-జీ నిరసనల వల్ల కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బారా జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని నేపాల్ పోలీసు ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధానమంత్రి సుశీలా కర్కి కూడా స్పందించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని సూచించారు. 2026, మార్చి 5న నేపాల్‎లో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడటానికి అత్యంత సంయమనం, సన్నద్ధతతో పనిచేయాలని హోంశాఖ, భద్రతా సంస్థలను ఆదేశించానని తెలిపారు. వీడియోలు

Next Story