- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంజాన్ వేళ షమీ పాపం చేశాడన్న జమాత్ నేత.. ‘ఇలా పాక్ ఆటగాళ్లను అనగలరా?’ అంటూ కుటుంబసభ్యులు ఫైర్
టీమిండియా(Team India) క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammed Shami)పై జమాత్ నేత షాబుద్దీన్ రిజ్వీ(Shahabuddin Rizvi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammed Shami)పై జమాత్ నేత షాబుద్దీన్ రిజ్వీ(Shahabuddin Rizvi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రిజ్వీపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షమీ ఏమైనా ఎంజాయ్ చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడా? అని మండిపడుతున్నారు. జాతీయ జట్టుకు ఆడటం గొప్ప అవకాశం, అది షమీకి దొరికింది.. దానికి ఆయన అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. సరిగ్గా జట్టు ఫైనల్‌కు వచ్చిన వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. రిజ్వీ వ్యాఖ్యలపై షమీ కుటుంబ సభ్యులు స్పందించారు. ‘టీమిండియా ఓటమిని కోరుకునే వారే ఇలా మాట్లాడుతారు. పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలా మంది ఉపవాసం ఉండలేదు. అలా అని వారిని కూడా విమర్శిస్తారా?, దేశం కోసం ఆటాడుతున్న వ్యక్తి పట్ల ఇలా మాట్లాడటం సరికాదు. దేశాన్ని గెలిపించడానికి షమీ ఏదైనా చేస్తాడు. ఫైనల్‌లో ఇండియా ఓటమిని కోరుకునేవారే షమీపై ఈ తరహా విమర్శలు చేస్తారు’ అని షమీ కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు.
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్(Semi final match)లో టీమిండియా క్రికెటర్ షమీ ఎనర్జీ డ్రింక్(Energy drink) తాగారు. ఇది గమనించిన ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసం(Ramadan Month) ప్రారంభమైన వేళ ఉపవాసం చేయకుండా షమీ పెద్ద పాపం చేస్తున్నాడని.. అతడిని అల్లా తప్పకుండా శిక్షిస్తాడని జమాత్ సంస్థ చీఫ్ రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసం ప్రారంభం అయ్యాక ప్రతి ముస్లిం యువకుడు ఉపవాసం చేయాలని షరియత్‌లో ఉందని, దీనిని అందరూ తప్పకుండా పాటించి తీరాల్సిందే అని అన్నారు. దీనికి షమీ దేవునికి సమాధానం చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు.






