కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్న టీచర్.. కాలేజీలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-12 17:33:55  IST  )

ఒడిశాలోని బాలాసోర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫకీర్ మోహన్ ఆటోనమస్ కాలేజీలో బీ.ఎడ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్యశ్రీ కాలేజీ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. 95% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది.

కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్న టీచర్..  కాలేజీలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఫకీర్ మోహన్ ఆటోనమస్ కాలేజీలో బీ.ఎడ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్యశ్రీ కాలేజీ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. 95% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. హెచ్‌ఓడీ సమీర్ కుమార్ సాహు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే ఇందుకు కారణం. కాగా సెక్సువల్ ఫేవర్స్ లేకపోతే విద్యా భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ విషయంపై జులై 1న ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ... కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ప్రిన్సిపల్ కార్యాలయం సమీపంలోనే సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థికి కూడా 70% కాలిన గాయాలు అయ్యాయి. ఇద్దరూ భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో క్రిటికల్ స్థితిలో ఉన్నారు.

ప్రస్తుతం నిందితుడు సమీర్ కుమార్ సాహు అరెస్ట్ అయ్యాడు. బాలాసోర్ ఎస్పీ రాజ్ ప్రసాద్, సైంటిఫిక్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఒడిశా ఉన్నత విద్యా శాఖ.. సాహు, ప్రిన్సిపల్ ఘోష్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనతో నిరసనలు వెల్లువెత్తగా.. ఒడిశా ఉన్నత విద్యా మంత్రి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

VIDEO

Next Story