రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అధిక లగేజీ తీసుకెళ్తే పన్ను కట్టాల్సిందే

by Gantepaka Srikanth |

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అధిక లగేజీ తీసుకెళ్తే పన్ను కట్టాల్సిందే

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అధిక లగేజీ తీసుకెళ్తే పన్ను కట్టాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వేశాఖ(Railway Department) కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అధిక లగేజీపై పన్ను(Luggage Tax) విధించింది. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఏసీ స్లీపర్ త్రీటైర్‌లో 40 కిలోల వరకే అనుమతి ఇచ్చారు. జనరల్ బోగీలో 35 కిలోల లగేజీ వరకు అనుమతి ఇచ్చారు. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలకు అవకాశం కల్పించారు. కాగా, దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. అయితే రైలులో తీసుకెళ్లే లగేజీపై పరిమితులు విధించడంతో ప్రయాణికులకు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య కంటే లగేజీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లగేజీ పరిమితిని రైల్వేశాఖ నిర్ణయించింది. రెండ్రోజుల క్రితం ఓ రైల్వే అధికారి దీనిపై మాట్లాడుతూ.. ప్రయాణికులు చాలా లగేజీలతో స్టేషన్‌లకు వస్తున్నారని, దీంతో ఒక్కోసారి రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దీనిని నివారించేందుకు.. లగేజీపై దృష్టి సారిస్తున్నాం అని తెలిపారు.

Next Story