Budget effect: కుప్పకూలిన దేశీయ మార్కెట్లు

by Prasad Jukanti |   (  Updated:2026-02-01 07:34:15  IST  )

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేకపోయింది.

Budget effect: కుప్పకూలిన దేశీయ మార్కెట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 యూనియన్ బడ్జెట్ స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేకపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ‘పన్ను’ దెబ్బకు సెన్సెక్స్‌ 2వేల పాయింట్ల పతనం అయింది. 700 పాయింట్లకు పైగా నిఫ్టీ పడిపోయింది. ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై ఎస్‌టీటీని పెంచడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2,800 పాయింట్ల మేర నష్టపోయింది. ఇవాళ 219 పాయింట్ల లాభంతో 82,489.45 వద్ద సెన్సెక్స్ కొనసాగింది. 51.77 పాయింట్ల లాభంతో 25,341.25 నిఫ్టీ ట్రేడ్ అయింది. అయితే ఫ్యూచర్స్ ట్రేండింగ్‌పై ఎస్‌టీటీ పెంచుతున్నట్లు బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

Read More..

Gold and silver: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం వెండి ధరలు

Next Story