ఎయిరిండియా విమాన ప్రమాదంపై క్షమాపణలు చెప్పిన టాటా గ్రూప్ ఛైర్మన్

by Yella Dhawani Reddy |

అహ్మదాబాద్‌ ఘోర విమానం ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

ఎయిరిండియా విమాన ప్రమాదంపై క్షమాపణలు చెప్పిన టాటా గ్రూప్ ఛైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌ ఘోర విమానం ప్రమాదం (Ahmedabad plane crash) యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా (TATA) గ్రూపుకు మాయని మచ్చని మిగిల్చింది. ఇక తాజాగా ఈ విషాద ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ (Tata Group Chairman N.Chandrasekaran) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమిక నివేదికలు అందడానికి కనీసం ఒక నెల సమయం పడుతుందని తెలిపారు.

విమానం అత్యంత భద్రతా ప్రమాణాలతో పనిచేస్తుందని, ఇటీవలి తనిఖీల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు గుర్తించలేదని ఆయన వివరించారు. పైలట్లు సైతం అనుభవజ్ఞులైనవారేనని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అన్ని మూల్యాంకనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకున్నందుకు ఎయిరిండియా, టాటా గ్రూప్ తరపున ఆయన బాధితుల కుటుంబాలకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కంపెనీ పూర్తి పారదర్శకంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

Next Story