- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tarrifs: అమెరికాకు చైనా మరో షాక్.. 84 శాతం టారిఫ్స్ విధింపు
చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాలు ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: చైనా అమెరికా (China America) మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాలు ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలపై అదే స్థాయిలో చైనా టారిఫ్స్ విధిస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ తమపై విధించిన 104 శాతం సుంకాలకు ప్రతీకారంగా అమెరికాపైనా 84 శాతం టారిఫ్స్ విధించింది. గతంలో 34 శాతం సుంకాలు ఉండగా దానిని 50 శాతం పెంచింది. గురువారం నుంచే పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 12 అమెరికన్ సంస్థలను ఎగుమతి చేసే వాటి జాబితాలో చేర్చినట్టు పేర్కొంది. చైనా నుంచి ఈ ప్రకటన వెలువడిన వెంటనే యూఎస్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
దేశ ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తాం: లిన్ జియాన్
తమ దేశ ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ (Lin jiyaan) స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలకు హాని కలిగించే ప్రయత్నాలను సహించబోమని చెప్పారు. అమెరికా చైనాపై సుంకాలను దుర్వినియోగం చేస్తోందని, ఈ బెదిరింపులకు భయపడబోమని వెల్లడించారు. యూఎస్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు చైనాపై పరస్పర సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయం ప్రపంచ వాణిజ్యాన్ని మరింత అస్థిరపరిచే ప్రమాదం ఉందని చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్లూటీఓ)ఓ తెలిపింది.






