Tarrifs: చైనాపై 245 శాతం సుంకాలు.. వెల్లడించిన వైట్ హౌస్

by vinod kumar |
Tarrifs: చైనాపై 245 శాతం సుంకాలు.. వెల్లడించిన వైట్ హౌస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా చైనా (America china)ల మధ్య వాణిజ్య యుద్ధం (Trade war) మరింత ముదిరింది. ఇప్పటికే చైనాపై 145 శాతం టారిఫ్‌ (Tarrifs)లు విధించిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) దానిని మరో 100 శాతం పెంచారు. దీంతో యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే చైనా వస్తువులపై మొత్తం సుంకం 245 శాతానికి పెరిగింది. ఈ మేరకు వైట్ హౌస్ (White house) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘చైనా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నది. అందుకే సుంకాలను 245 శాతానికి పెంచాం. ట్రంప్ కొనసాగిస్తున్న అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. అమెరికాకు అవసరమైన అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాలు ఎగుమతులను చైనా నిలిపివేసిందని గుర్తు చేసింది. అంతకుముందు అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి కొత్త విమానాల డెలివరీని తీసుకోవద్దని చైనా తన విమానయాన సంస్థలను ఆదేశించింది. అంతేగాక అమెరికాలో తయారైన విమాన భాగాలు, పరికరాల కొనుగోలును ఆపివేయాలని తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే వైట్ హౌస్ సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

వైట్ హౌస్ నిర్ణయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ (lin jiyaan) స్పందించారు. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి భయపడటం లేదని తెలిపారు. చైనా తన హక్కులను కాపాడుకోవడానికి వెనుకాడబోదని స్పష్టం చేశారు. సుంకాల యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానేనని తెలిపారు. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండబోదరి పేర్కొన్నారు. ఈ విషయంపై యూఎస్ చర్చలు జరపాలనుకుంటే బ్లాక్ మెయిల్ చర్యలు, బెదరింపులు ఆపాలని తెలిపారు. కాగా, ఇతర దేశాలపై ట్రంప్ పరస్పర సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే చైనాపై మాత్రం సుంకాలను విధిస్తూనే ఉన్నారు.

Next Story

Most Viewed