- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సేఫ్ బంగ్లాదేశ్’ దేశం నిర్మిస్తా.. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిక్ రహమాన్
‘సేఫ్ బంగ్లాదేశ్’ దేశం నిర్మిస్తానంటూ బీఎన్‌పీ యాక్టింగ్ ప్రెసిడెంట్ తారిక్ రహమాన్ అన్నారు. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన ఆయనకు భారీ స్వాగతం లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ తిరిగి స్వదేశంలో అడుగుపెట్టారు. సుమారు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ వచ్చిన ఆయన.. ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి ఎన్నికలకు ముందు ఆయన రాక.. బీఎన్‌పీ వర్గాల్లో కొత్త జోష్ నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికితోడు వచ్చే ఎన్నికల్లో పోటీ పడకుండా ఇప్పటికీ ఆవామీ లీగ్‌ను నిషేధించడంతో బీఎన్‌పీ విజయం పక్కా అని వారి అభిప్రాయం. అదే సమయంలో రహమాన్‌ను ఆహ్వానిస్తూ బీఎన్‌పీ నిర్వహించిన సభకు ప్రజలలు భారీ ఎత్తున హాజరయ్యారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారీగా హింసాకాండ జరుగుతున్న వేళ.. ఢాకాలో ఆయన తొలి ప్రసంగంలో సెక్యులర్ దేశం కోసం తారిక్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, మతాలకు అతీతంగా అందరూ కలిసి లా అండ్ ఆర్డర్‌ను కాపాడుకోవాలని ఆయన అన్నారు. తను కుల, మతాలకు అతీతంగా అందరికీ భద్రత కల్పించే ‘సేఫ్ బంగ్లాదేశ్’ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం ప్రజలంతా తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముస్లింలు, హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు.. అందరూ ఈ దేశంలో ఉన్నారని, మహిళలు-పిల్లలు కూడా ఇంటికి భద్రంగా తిరిగొచ్చే దేశాన్ని నిర్మిస్తానన్నారు.
ఆవామీ లీగ్‌పై నిషేధం
ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పాల్గొనకుండా బంగ్లా ఎన్నికల సంఘం నిషేధించింది. దీంతో గతంలో బీఎన్‌పీతో కలిసి పోటీ చేసిన జమాత్-ఎ-ఇస్లామీ పార్టీనే బీఎన్‌పీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.






