టార్గెట్ ‘డియెగో గార్సియా’.. హిందూ మహాసముద్రంపైకి ఇరాన్ మిస్సైల్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-21 04:47:36  IST  )

యుద్ధం కొత్త మలుపు తిరిగింది. హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియా అమెరికా-బ్రిటన్ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

టార్గెట్ ‘డియెగో గార్సియా’.. హిందూ మహాసముద్రంపైకి ఇరాన్ మిస్సైల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తారా స్థాయికి చేరింది. హిందూ మహాసముద్రం (Indian Ocean)లోని అత్యంత వ్యూహాత్మకమైన డియెగో గార్సియా (Diego Garcia) అమెరికా-బ్రిటన్ ఉమ్మడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ (Iran) రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులలో ఒకటి గాలిలోనే కూలిపోగా, రెండో దానిని అమెరికా యుద్ధ నౌక తన SM-3 ఇంటర్‌సెప్టర్ ద్వారా అడ్డుకుంది. ఈ దాడుల వల్ల స్థావరానికి ఎలాంటి నష్టం కలగలేదు.

ఇరాన్ నుంచి డియెగో గార్సియా సుమారు 4 వేల కి.మీ దూరంలో ఉంది. గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి తమ క్షిపణుల పరిధి కేవలం 2 వేల కి.మీ మాత్రమేనని ప్రకటించారు. అయితే తాజా దాడితో ఇరాన్ వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉందని, వారు ప్రపంచానికి అబద్ధం చెప్పారని స్పష్టమైంది. ఇరాన్ నౌకలపై దాడులకు తమ స్థావరాలను వాడుకోవచ్చని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ అమెరికాకు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.

Next Story