తన కళ్ల ముందే తండ్రి హత్య.. తల్లి రాసలీలలను బయటపెట్టిన మూడేళ్ల చిన్నారి..

by Sujitha Rachapalli |

దేశంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా భర్తను భార్య మర్డర్ చేసే కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో పథకం ప్రకారం ప్రియుడితో భర్తను హత్య చేయించింది భార్య. పోలీసుల ముందు తనకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరించింది

తన కళ్ల ముందే తండ్రి హత్య..  తల్లి రాసలీలలను బయటపెట్టిన మూడేళ్ల చిన్నారి..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా భర్తను భార్య మర్డర్ చేసే కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో పథకం ప్రకారం ప్రియుడితో భర్తను హత్య చేయించింది భార్య. పోలీసుల ముందు తనకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరించింది. కానీ మూడేళ్ల తన కూతురు విస్తుపోయే నిజాలు చెప్పడంతో బుక్కైంది.

వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భరత్(36), బెంగళూరుకు చెందిన నందిని(26)కి ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా. చెన్నైలోని ఓ హోటల్‌లో చెఫ్ మాస్టర్‌గా పని చేసే భరత్.. వారానికి ఓసారి ఇంటికొచ్చి కుటుంబంతో గడిపి వెళ్తుంటాడు. వారిని అన్ని విధాలుగా బాగా చూసుకుంటాడు. కానీ భర్త చెన్నైలో ఉండటంతో భార్య పక్కదారి పట్టింది. సంజయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భరత్ చాలా సార్లు మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ప్రియుడితో గడిపేందుకు అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలనుకుంది నందిని.

పథకం ప్రకారమే ఈ నెల 21న ఇంటికొచ్చిన భర్తను సరుకుల కోసం బయటకు తీసుకెళ్లింది. భార్యాభర్తలు, చిన్న కూతురు బైక్‌పై దుకాణానికి వెళ్లారు. అయితే ఇంటికి తిరిగొచ్చే మార్గంలో అనుకున్నట్లుగానే భర్తను హత్య చేయించేందుకు సంజయ్‌ను దారిలో ఉంచింది. రోడ్డుపై కొబ్బరిమట్టలు ఉండటంతో వాటిని దాటే క్రమంలో బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో.. ఇదే అదునుగా అకస్మాత్తుగా వచ్చి భరత్‌పై దాడిచేశాడు సంజయ్. కత్తితో పొడిచి పారిపోయాడు. దీంతో భారీ రక్తస్రావంతో చనిపోయాడు భరత్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. విచారణలో పొంతనలేని సమాధానం చెప్పింది నందిని. దీంతో మూడేళ్ల చిన్నారిని ప్రశ్నించగా.. వాస్తవాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా బయటపెట్టింది. ఇంటి దగ్గర ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి పారిపోయాడని తెలిపింది. మొత్తానికి మూడేళ్ల చిన్నకూతురు తల్లి రాసలీలలు బయటపెట్టగా.. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు.. నందిని, సంజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Next Story