- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamilnadu: వీసీల నియామకంపై వీడని సస్పెన్స్.. ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు
వీసీల నియామకంపై సస్పెన్స్ వీడలేదు. సీఎంకు వీసీని నియమించే అధికారం కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం సవరించిన చట్టాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్స్ (VC)ల నియామకంపై సస్పెన్స్ వీడలేదు. సీఎంకు వీసీని నియమించే అధికారం కల్పిస్తూ తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వం సవరించిన చట్టాలపై మద్రాస్ హైకోర్టు (Madras high court) స్టే విధించింది. బీజేపీ నేత వెంకటాచలపతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పది సవరణ చట్టాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
వీటిలో పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ప్రభుత్వం చట్టాలను నిలిపివేసింది. దీంతో డీఎంకే ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకినట్టు అయింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై గవర్నర్ ఆర్ ఎన్ రవి గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక డిసిషన్ తీసుకోవడం గమనార్హం.






