రాజకీయ నాయకుడితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో గుండాలతో దాడి.. చావు బతుకుల్లో..

by Sujitha Rachapalli |

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన ఎఫైర్ గురించి తెలిసిందని భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది భార్య. ప్రస్తుతం ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితుడి కండిషన్ క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. శివగంగా జిల్లాకు చెందిన వ్యక్తి విదేశాల్లో పని చేస్తుండగా

రాజకీయ నాయకుడితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో గుండాలతో దాడి.. చావు బతుకుల్లో..
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన ఎఫైర్ గురించి తెలిసిందని భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది భార్య. ప్రస్తుతం ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితుడి కండిషన్ క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. శివగంగా జిల్లాకు చెందిన వ్యక్తి విదేశాల్లో పని చేస్తుండగా భార్య ఇండియాలోనే ఉంటుంది. అయితే భర్త ఆమె ఫోన్ కాల్స్‌ గురించి తెలుసుకునేందుకు ఓ టెక్నాలజీని ఉపయోగించాడు. ఈ క్రమంలో ఆమె స్థానిక డీఎంకే నాయకుడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ఆయన బెదిరించాడు. ఇలాంటివి మానుకోకపోతే అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత ఇండియాకు వచ్చాడు.

ఈ క్రమంలో భార్య, ప్రియుడు కలిసి అతన్ని లేపేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆరుగురు గుండాలను నియమించారు. అతనిపై దాడి చేయించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చావు బతుకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు భార్య, ప్రియుడు, గుండాలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీ భార్య ఎఫైర్‌ను బయటపెట్టింది కానీ తనను మాత్రం దుండగుల దాడి నుంచి కాపాడలేకపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story