- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకేనే ఆ సమయంలో కరెంట్ ఆపాలని కోరింది : విద్యుత్ బోర్డు సంచలన ప్రకటన
సెప్టెంబర్ 27న సాయంత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 27న సాయంత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనకు అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేయడం, ఆ సమయంలో కరెంట్ పోవడంతో ప్రజల మధ్య తోపులాట జరగడంతోనే తొక్కిసలాట జరిగి పలువురి ప్రాణాలు పోయినట్లు టవీకే పార్టీ ఆరోపించింది. మరోవైపు విజయ్ రావలసిన సమయానికంటే ఏడు గంటలు ఆలస్యంగా రావడం, అనుమతికి మించి ప్రజల రాక, నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి ప్రధాన కారణాలని పోలీసులు చెప్తున్నారు.
తాజాగా తమిళనాడు విద్యుత్ బోర్డు ఈ ఘటనపై స్పందించింది. విజయ్ కార్నర్ మీటింగ్ సమయంలో విద్యుత్ సరఫరా ఆపివేయాలని టీవీకే పార్టీనే వినతిపత్రం ఇచ్చిందంటూ విద్యుత్ బోర్డు బాంబ్ పేల్చింది. బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి.. తమకు టీవీకే పార్టీకి చెందిన నేతలు.. విజయ్ ర్యాలీ సమయంలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపివేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. వేలుసామిపురం వద్ద భారీగా ప్రజలు ఉంటారన్న అంచనాతో పవర్ కట్ చేయాలని కోరారన్నారు. టీవీకే చేసిన ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామని తెలిపారు. మరోవైపు తొక్కిసలాట సమయంలో ఆ ప్రాంతంలో పవర్ కట్ జరగలేదని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వమే కావాలని విద్యుత్ సరఫరా ఆపివేయించిందని టీవీకే చేస్తున్న ఆరపణలు నిరాధారమని తెలుస్తోంది. విద్యుత్ బోర్డు చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో సంచలనానికి దారితసింది.






