- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mayonnaise Ban : మయోనీస్ ను బ్యాన్ చేసిన మరో రాష్ట్రం
రకరకాల ఆహార పదార్థాలలో వాడే మయోనీస్(Mayonnaise) ను మరో రాష్ట్రం బ్యాన్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : రకరకాల ఆహార పదార్థాలలో వాడే మయోనీస్(Mayonnaise) ను మరో రాష్ట్రం బ్యాన్ చేసింది. మయోనీస్ ను బ్యాన్(Mayonnaise Ban) చేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం(Tamilanadu Govt) గురువారం ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొంది. అలాగే ఈ పదార్థాన్ని హై రిస్క్ పదార్థంగా(High Risk Food) పరిగణిస్తూ.. హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో మయోనీస్ ను వాడినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పచ్చిగుడ్లు, వెజిటబుల్ ఆయిల్, వెనిగర్ వంటి పదార్థాలతో తయారు మయోనీస్ ను తయారు చేస్తున్నారని, గుడ్లను ఉడకబెట్టకుండా పచ్చివే వాడటం వలన అది ఎక్కువసేపు నిలవ ఉంటే దానిలో హానికర సూక్ష్మజీవులు తయారై ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
అది తిన్న చాలామంది ఇటీవల అనారోగ్యం పాలవడంతో ప్రభుత్వం ఏడాది పాటు రాష్ట్రంలో మయోనీస్ ను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతేడాది అక్టోబర్ లో హైదరాబాద్ నగరంలోని ఓ మోమోస్ షాపులో మయోనీస్ తినడం వలన తీవ్ర అనారోగ్యం పాలయ్యి ఓ మహిళ మృతి చెందగా.. ఏడాది పాటు మయోనీస్ ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇలాంటి ఘటన చెన్నైలో జరగగా.. తమిళ సర్కార్ కూడా మయోనీస్ మీద నిషేధం ప్రకటించింది.






