Tamil Nadu: డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు ఒక్క సీటు కోల్పోదు- అమిత్ షా

by Shamantha N |

వివాదాస్పద డీలిమిటేషన్ అంశంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

Tamil Nadu: డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు ఒక్క సీటు కోల్పోదు- అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద డీలిమిటేషన్ అంశంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే, తమిళనాడు ఎనిమిది మంది ఎంపీలను కోల్పోతుందన్న వ్యాఖ్యలను ఖండించారు. తమిళనాడు ఒక్కసీటు కూడా కోల్పోదని నొక్కిచెప్పారు. అమిత్ షా మాట్లాడుతూ.."డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటు సీట్లు తగ్గవని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే లోక్‌సభలో స్పష్టం చేశారు" అని చెప్పుకొచ్చారు. మరోవైపు, రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Lok Sabha delimitation) అంశం, అందులోని సమస్యలపై చర్చించేందుకు 40 రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఇలాంటి సమయంలో అమిత్ షా డీలిమిటేషన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తమిళ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు

జాతీయ విద్యావిధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమిత్ షా స్పందించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం (Tamil) అని.. అలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని.. తమిళనడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది బీజేపీకి చారిత్రాత్మక సంవత్సరంగా మారిందన్నారు. నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా మారారని గుర్తుచేశారు. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ.. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story