విజయ్ ఇంటి వద్దకు పోలీస్ కాన్వాయ్..

by velandi.Saikiran |

త‌మిళ‌నాడు టీవీకే అధినేత‌ విజయ్ ఇంటి వద్దకు పోలీస్ కాన్వాయ్ చేరుకుంది.

విజయ్ ఇంటి వద్దకు పోలీస్ కాన్వాయ్..
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే... అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ తరుణంలో టీవీకే పార్టీ అధినేత విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

ఈ క్రమంలో తమిళనాడు పోలీస్ కాన్వాయ్, విజయ్ ఇంటి వద్దకు చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే, అవకాశాలు ఉన్న నేపథ్యంలో విజయ్ కి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద మూడంతల భద్రత ఏర్పాటు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 107 స్థానాలు రాగా. డీఎంకే పార్టీకి 60 స్థానాలు దక్కాయి. అన్నాడీఎంకే పార్టీకు 47 స్థానాలు వచ్చాయి. తమిళనాడులో అధికారం చేపట్టడానికి 118 సీట్లు కావాల్సి ఉంది. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విజయ్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Next Story