Tamil Nadu : తమిళనాట హిందీ బోర్డులు మాయం !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-26 15:12:05  IST  )

తమిళనాడు(Tamil Nadu)రాష్ట్రంలో అధికార డీఎంకే(DMK) పెంచిపోషిస్తున్న స్వభాషోద్యమం..హిందీ వ్యతిరేకత రోజురోజుకు విస్తరిస్తుంది. రాష్ట్రంలో డీఎంకే శ్రేణులు కేంద్ర నూతన విద్యావిధానం(NEP)..త్రిభాష విధానం పట్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తు ఆందోళనలు నిర్వహిస్తు్న్నాయి

Tamil Nadu : తమిళనాట హిందీ బోర్డులు మాయం !
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamil Nadu)రాష్ట్రంలో అధికార డీఎంకే(DMK) పెంచిపోషిస్తున్న స్వభాషోద్యమం..హిందీ వ్యతిరేకత రోజురోజుకు విస్తరిస్తుంది. రాష్ట్రంలో డీఎంకే శ్రేణులు కేంద్ర నూతన విద్యావిధానం(NEP)..త్రిభాష విధానం పట్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తు ఆందోళనలు నిర్వహిస్తు్న్నాయి. ఈ క్రమంలో కొందరు కేంద్ర ప్రభుత్వ సంస్థల(Central Government Agencies) బోర్డుల(Boards) మీద హిందీ పేర్లను చెరిపేసే(Elimination of Hindi Names) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోసల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారాయి.

తమిళనాడు ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని (NEP) ఆమోదించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని రెండు రైల్వే స్టేషన్లు, బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులలో త్రిభాషా నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను డీఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. టెన్కాసి ఉత్తర జిల్లా డీఎంకే కార్యదర్శి కూడా అయిన ఎంల్ఏ ఈ. రాజా నేతృత్వంలో కార్యకర్తలు శంకరన్ కోవిల్ రైల్వే స్టేషన్ సైనేజ్ వద్ద హిందీ అక్షరాలను నల్ల పెయింట్‌తో పెయింట్ చేసి, తమిళనాడులో పరోక్షంగా హిందీని విధించడానికి ప్రయత్నించినందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాలోని స్టేషన్ లోపల రైల్వే ప్లాట్‌ఫారమ్‌లోని నేమ్ బోర్డుతో పాటు, పావుర్‌చత్రం రైల్వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద నేమ్ బోర్డు నుండి హిందీ అక్షరాలై నల్లరంగు పులిమారు.

అదేవిధంగా డీఎంకే కార్యకర్తలు అలంగుళంలోని పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని నేమ్ బోర్డులలోని హిందీ అక్షరాలను తుడిచివేశారు. ఈ వ్యవహరంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దక్షిణ భారతదేశం పట్ల ఉత్తరాది పెత్తనంపై విరుగుడని కొందరు..భాషోన్మాదం పరాకాష్టకు చేరిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. తమిళ సంస్థల హిందీ భాష వ్యతిరేకత కాస్తా ప్రాంతీయవాదంగా..జాతీయ వాద భావజాలాన్ని నీరుగార్చేలా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

డీఎంకే రాజకీయ కోణంలోనే హిందీ వ్యతిరేకతను రెచ్చగొడుతుందని మరికొందరు తప్పుబడుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 10,000 కోట్లు అందించినప్పటికీ తాను ఎన్ఈపీపై సంతకం చేయనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టంగా ప్రకటించారు. 'ఎన్ఈపీ తమిళనాడును 2,000 సంవత్సరాలు వెనక్కి నెట్టే పాపాన్ని చేయడానికి నేను అనుమతించనన్నారు.

తాజాగా సమగ్ర శిక్ష పథకం కింద తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానంతో సహా ఎన్ఈపీని పూర్తిగా అమలు చేయకపోతే రూ. 2,152 కోట్ల నిధులను విడుదల చేయబోమని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దీనిపై సీఎం స్టాలిన్ ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ లేఖ రాశారు. ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లు దేశంలో ఏ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. అయినప్పటికి తమిళనాడు ఎన్ఈపీకి, కేంద్రానికి, హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


click for tweet ..

Next Story