- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్దతుపై సందిగ్ధత.. వీసీకే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
యావత్ దేశం చూపంతా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపైనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడై ఐదురోజులవుతున్నా.. ఇంకా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు మార్గం సుగమం కాలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యావత్ దేశం చూపంతా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపైనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడై ఐదురోజులవుతున్నా.. ఇంకా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు మార్గం సుగమం కాలేదు. ఎన్నికల ఫలితాల్లో 108 స్థానాల్లో విజయం సాధించిన టీవీకే పార్టీ.. లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో.. గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు. దీంతో పార్టీ అధినేత, సీఎం క్యాండిడేట్ అయిన విజయ్ ఎమ్మెల్యేల మద్దతు కోరే పనిలో బిజీగా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఇతర పార్టీల నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతివ్వగా.. ఎమ్మెల్యేల సంఖ్య 117కు చేరింది. ఇంకొక్క ఎమ్మెల్యే మద్దతిస్తే విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుంది.
కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే ముందుకొచ్చింది. కానీ.. అందుకు కొన్ని కండీషన్లు పెట్టినట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీకే చీఫ్ కు డిప్యూటీ సీఎంతోపాటు మంత్రుల పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నేడు విజయ్ వీసీకేతో భేటీ అయ్యారు. అనంతరం వీసీకే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా..ఇంకా ఆ సస్పెన్స్ కు తెర దించలేదు. సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ చీఫ్ ప్రెస్ మీట్ పెట్టి మద్దతుపై స్పష్టతనిస్తారని సమాచారం. వీసీకే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు మళ్లీ నిరాశే ఎదురైంది. సాయంత్రం చేసే ప్రకటనలో శుభవార్తే ఉండాలని విజయ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.






