- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Annamalai : కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై!
అన్నా యూనివర్శిటీ విద్యార్థిని(Anna University student)పై లైంగిక వేధింపుల కేసు(Sexual harassment case)పై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు(Tamil Nadu BJP President) కె.అన్నామలై(Annamalai) వినూత్న నిరసనకు దిగాడు.

దిశ, వెబ్ డెస్క్ : అన్నా యూనివర్శిటీ విద్యార్థిని(Anna University student)పై లైంగిక వేధింపుల కేసు(Sexual harassment case)పై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు(Tamil Nadu BJP President) కె.అన్నామలై(Annamalai) వినూత్న నిరసనకు దిగాడు. అన్నామలై కోయంబత్తూరులోని తన ఇంట్లో కొరడాతో కొట్టుకుని(Beat with a whip) నిరసన వ్యక్తం చేశారు. అన్నామలై నిరసన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో డీఎంకే సర్కారు పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు.
డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు వేసుకోబోనని ఆయన ప్రకటించారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని చెప్పారు. డీఎంకేను గద్దె దించేందుకు శుక్రవారంనాటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి సుబ్రహ్మణ్యస్వామిని వేడుకుంటానని తెలిపారు. చెప్పినట్లుగానే ఈ రోజు తన నివాసంలో అన్నామలై కొరడాతో తన దేహంపై కొట్టుకుని నిరసన తెలిపారు.
అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల ఘటనపై ఇప్పటికే అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడులో నాగరిక రాజకీయాలకు తావు లేనందున.. ఇక నుంచి తన రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అనడం సిగ్గుచేటని ప్రశ్నించారు. నిర్భయ ఫండ్ కేటాయించిన అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేకపోవడం ఏమిటని అన్నామలై మండాపడ్డారు. పోలీసులు ఎఫ్ఎఆర్ ను లీక్ చేయడంతో పాటు అందులో బాధితురాలి గుర్తింపును బయటపెట్టడాన్ని ఆయన ఖండించారు.






