గంగలో కలిసిన పాకిస్థాన్ పరువు.. జీడీపీలో తమిళనాడు కొత్త రికార్డు

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఇండియా కంటే

గంగలో కలిసిన పాకిస్థాన్ పరువు.. జీడీపీలో తమిళనాడు కొత్త రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఇండియా కంటే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా అలాగే సైనిక పరంగా... నష్టాల్లో కూరుకుపోయింది పాకిస్తాన్. ప్రపంచ దేశాలను అప్పు అడగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు మరో ఊహించని షాక్ తగిలింది.

అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారి జీడీపీ ( GDP) కూడా తగ్గిపోయింది. సౌత్ ఇండియా రాష్ట్రమైన తమిళనాడు కంటే... తక్కువగా పాకిస్తాన్ జీడీపీ రేటు తగ్గింది. దీoతో పాకిస్తాన్ జిడిపిని దాటిపోయింది తమిళనాడు. 1995 లెక్కలు ఒకసారి పరిశీలిస్తే... తమిళనాడు జిడిపి ఆ సమయంలో 15.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

అప్పుడు పాకిస్తాన్ జిడిపి 57.9 బిలియన్ డాలర్లుగా ఉండేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 2025 లెక్కలు పరిశీలిస్తే... తమిళనాడు జిడిపి.. 419.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే 35.8 లక్షల కోట్లు ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ జిడిపి 397.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఈ లెక్కన 33.9 లక్షల కోట్లు.. ఉందన్నమాట. 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఈ తేడా గమనించవచ్చు. దీంతో పాకిస్తాన్ దేశంపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.

Next Story