PM Vishwakarma : ‘పీఎం విశ్వకర్మ’కు కౌంటర్‌గా ‘కళైంగర్ హ్యాండీ క్రాఫ్ట్స్’ స్కీం

by Hajipasha |   (  Updated:2024-12-08 12:52:24  IST  )

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ స్కీం(PM Vishwakarma scheme)కు కౌంటర్‌గా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం మరో స్కీంను తీసుకొచ్చింది.

PM Vishwakarma : ‘పీఎం విశ్వకర్మ’కు కౌంటర్‌గా ‘కళైంగర్ హ్యాండీ క్రాఫ్ట్స్’ స్కీం
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ స్కీం(PM Vishwakarma scheme)కు కౌంటర్‌గా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం మరో స్కీంను తీసుకొచ్చింది. దానికి ‘కళైంగర్ హ్యాండీ క్రాఫ్ట్స్’ స్కీం అని పేరు పెట్టింది. తమిళ భాషలో దీన్ని ‘కళైంగర్ కైవినై థిట్టం’ అని పిలుస్తారు. అధికార డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి(Karunanidhi)ని ‘కళైంగర్’ అని పిలుస్తుంటారు. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ స్కీం అనే కులపరంగా ప్రజలను విడగొట్టేలా, వివక్షను పెంచేలా ఉందని డీఎంకే ప్రభుత్వం గతంలో విమర్శించింది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా అమలు చేసేందుకు ‘కళైంగర్ హ్యాండీ క్రాఫ్ట్స్’ స్కీంను తీసుకొచ్చింది.

ఈ స్కీం అమలుపై తమిళనాడు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి టి.ఎం.అంబరాసన్ ప్రకటన విడుదల చేశారు. 25 రకాల చేతి వృత్తులు/హస్త కళలపై ఆధారపడి జీవించే వారికి చేదోడుగా నిలవడమే ఈ స్కీం లక్ష్యమని వెల్లడించారు. ‘‘ఈ స్కీంకు ఎంపికయ్యే వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తాం. అందులో దాదాపు 25 శాతాన్ని (గరిష్ఠంగా రూ.50వేలు) సబ్సిడీగా పొందొచ్చు. వడ్డీపైనా 5 శాతం దాకా రాయితీ లభిస్తుంది’’ అని మంత్రి టి.ఎం.అంబరాసన్ చెప్పారు.

Next Story