నువ్వు మగాడివైతే రా.. రా చూసుకుందాం.. పాక్ ఆర్మీ చీఫ్ కు తాలిబన్ల సవాల్

by Muthe.Rajitha |

ఇటీవల పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే.

నువ్వు మగాడివైతే రా.. రా చూసుకుందాం.. పాక్ ఆర్మీ చీఫ్ కు తాలిబన్ల సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల వార్ అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. సీజ్ ఫైర్ ప్రకటించుకున్నప్పటికీ.. ఇరువైపులా మతాల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు తెహ్రిక్-ఇ-తాలిబన్ కు సవాల్ విసిరింది. తమపైకి సైనికులను పంపడం కాదని, మగాడివైతే నువ్వొక్కడివే రావాలని టీటీపీ కమాండర్ చీఫ్ కజీమ్ ఛాలెంజ్ చేసారు. అంతేకాదు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తల్లిపాలు తాగి ఉంటె తమతో పోరాడాలని సవాల్ విసిరారు. అయితే టీటీపీ చీఫ్ కజీమ్ సమాచారం ఇచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డు ప్రకటించింది పాక్ ప్రభుత్వం. కాగా టీటీపీ స్టేట్మెంట్ పై పాక్ ఆర్మీ చీఫ్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

Next Story