TALIBAN-US: ఖైదీల మార్పిడికి అమెరికా- తాలిబన్ల మధ్య డీల్..!

by Shamantha N |

అమెరికాకు (US), తాలిబన్ల (Taliban)కు మధ్య డీల్ కుదిరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

TALIBAN-US: ఖైదీల మార్పిడికి అమెరికా- తాలిబన్ల మధ్య డీల్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు (US), తాలిబన్ల (Taliban)కు మధ్య డీల్ కుదిరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్‌ ఫైటర్‌ ఖాన్‌ మహమ్మద్‌ (Khan Muhammad)ను విడిపించుకోవడానికి తమ దగ్గరున్న అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, రెండు దశాబ్దాల క్రితం అఫ్గాన్‌ ఫైటర్‌ ఖాన్‌ మహమ్మద్‌ ని అమెరికా అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియాలోని జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఖాన్‌ మహమ్మద్‌ను తమకు అప్పగిస్తే.. తమ వద్దనున్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. యూఎస్‌తో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అయినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఈ మార్పిడి ఒప్పందం కుదిరిందని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదం చేశాయన్నారు.

అమెరికా ఖైదీల కుటుంబసభ్యులు ఏమన్నారంటే?

అమెరికా- తాలిబన్ డీల్ పై యూఎస్ ఖైదీలలో ఒకరైన ర్యాన్ కార్బెట్ కుటుంబం మీడియాతో మాట్లాడింది. ర్యాన్‌ తనకు దూరమై 894 రోజులు అయ్యింది.. ఈ రోజులు తమ జీవితంలో అత్యంత సవాలుతో కూడుకున్నవని అన్నారు. 2022లో తాము విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తాలిబన్లు ఆయనను కిడ్నాప్‌ చేశారని తెలిపారు. ఇన్నాళ్లకు తిరిగి ర్యాన్‌ను తమకు అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా తమ వారిని విడిపించుకునేందుకు తాలిబన్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ పలుమార్లు తెలిపారని పేర్కొన్నారు. ఇటీవల బాధితుల కుటుంబసభ్యులతో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ తాలిబన్ల చెరలో ఉన్నవారి విడుదలకు ప్రయత్నాలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు.

Next Story