- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి
మార్చి 3 నుంచి పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8.21 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.

- ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
- తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులు పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో హాజరు కావాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. సోమవారం (మార్చి 3) నుంచి తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషి, పట్టుదలతో చదివిన చదువు పరీక్షల్లో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ కృషిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు కూడా దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో పరీక్షలు రాయండని స్టాలిన్ కోరారు. చక్కగా నిద్రపోవాలని, ఆహారపు అలవాట్లు కూడా మంచిగా ఉండేలా చూసుకోవాలని దాని వల్ల మానసికకంగా విశ్వాసంతో ఉంటారని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం, తాను ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటామని.. పరీక్షల్లో మంచి విజయం సాధించాలని.. అందుకు ముందస్తుగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. కాగా మార్చి 3 నుంచి పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8.21 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇక మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న పదకొండో తరగతి పరీక్షల్లో 8.23 లక్షల మంది హాజరుకానున్నారు.






