Tajani: రేపు భారత్‌లో పర్యటించనున్న ఇటలీ ఉప ప్రధాని.. వెల్లడించిన విదేశాంగ శాఖ

by B.Srinivas |

ఇటలీ ఉపప్రధాని, ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ శుక్రవారం భారత్‌లో పర్యటించనున్నారు.

Tajani: రేపు భారత్‌లో పర్యటించనున్న ఇటలీ ఉప ప్రధాని.. వెల్లడించిన విదేశాంగ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీ ఉపప్రధాని, ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ (Antonio Tajani) శుక్రవారం భారత్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన ఇండియాకు రానున్నారు. ఈ సందర్భంగా తజానీ విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) , వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ (Piyush goyal) లతో భేటీ అవుతారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ ఆయన సమావేశమవుతారని పేర్కొంది. ఫిబ్రవరిలో భారత్, ఇటలీ ప్రతినిధులు చర్చలు జరిపారు.

వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం, మౌలిక సదుపాయాలు, రవాణా వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం పై డిస్కస్ చేశారు. అలాగే ఈ కీలక రంగాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, దానిని సంబంధించిన మార్గాలను అన్వేషించడానికి పీయూష్ గోయల్ ఇటలీ విదేశాంగ కార్యదర్శి మరియా త్రిపొడి, భారత్‌లోని ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలితోనూ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే తజానీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Next Story