- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Ram Mandir : తాజ్‌మహల్, అయోధ్య రామమందిరాలను పోలుస్తూ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఆనాడు తాజ్‌మహల్(Taj Mahal)ను నిర్మించిన కార్మికుల చేతులను నరికేస్తే.. ఈనాడు అయోధ్య రామమందిరం(Ram Mandir) నిర్మించిన కార్మికులను సత్కరించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అన్నారు. రామమందిరం నిర్మాణ పనుల్లో పాల్గొన్న కూలీలను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనవరి 22న సత్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోని కార్మికులు, కూలీలకు ఇప్పుడు గౌరవం, భద్రత లభిస్తున్నాయన్నారు.
‘‘భారతదేశ వారసత్వానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం భారత వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న కొంతమంది.. మన దేశ సంస్కృతి ఉనికిలోకి వచ్చిన సమయానికి పుట్టనే లేదు’’ అని సీఎం యోగి తెలిపారు. ‘‘భారతదేశానికి ఎన్‌సెఫలైటిస్ వ్యాక్సిన్ రావడానికి 100 ఏళ్లు పట్టింది. కానీ మోడీ హయాంలో కరోనా వ్యాక్సిన్ కేవలం 9 నెలల్లోనే అందుబాటులోకి వచ్చింది’’ అని ఆయన గుర్తుచేశారు. ‘‘ ఒకవైపు పాకిస్తాన్ అడుక్కు తింటుంటే.. మరోవైపు మనదేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం. మతం, కులం అనేది చూడకుండా రేషన్ అందిస్తున్నాం’’ అని యోగి పేర్కొన్నారు.