- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tahir Hussain: తాహిర్ హుస్సేన్‌కు షాక్.. మధ్యంతర బెయిల్‌పై బెంచ్ భిన్నాభిప్రాయాలు
హుస్సేన్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్ (Tahir Hussain)కు షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు (Supreme court) బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిట్టల్ తాహిర్ పిటిషన్‌ను తిరస్కరించగా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మొగ్గుచూపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ప్రతి ఖైదీ కోర్టును ఆశ్రయిస్తారని మిట్టల్ తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా హుస్సేన్‌కు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే హక్కు ఉందని అహ్సానుద్దీన్ అభిప్రాయపడ్డారు.బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ అంశంపై త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. గతంలో ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.






