EC: ఒక్కరితో ఈసీ నడవట్లేదు.. ఆప్ విమర్శలకు కౌంటర్..!

by Shamantha N |

ఢిల్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమపై చేసిన ఆరోపణలపై ఈసీ (EC) స్పందించింది. ఒక్కరితో తమ సంస్థ నడవట్లేదని నొక్కిచెప్పింది.

EC: ఒక్కరితో ఈసీ నడవట్లేదు.. ఆప్ విమర్శలకు కౌంటర్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమపై చేసిన ఆరోపణలపై ఈసీ (EC) స్పందించింది. ఒక్కరితో తమ సంస్థ నడవట్లేదని నొక్కిచెప్పింది. రాజకీయ దురుద్దేశాలు తమపై ఆపాదించొద్దని స్పష్టం చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను పోల్ కమిషన్ గమనించిందని పేర్కొంది. అయితే, ఆ ఆరోపణలపై సంయమనం పాటించాలని.. అలాంటి అవివేక వ్యాఖ్యలను తెలివితేటలతో స్వీకరించాలని ఎంచుకున్నట్లు వెల్లడించింది. "ఇటువంటి వంచనలకు లొంగబోమని" ఈసీ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికలకు ముందు లేవనెత్తిన సమస్యలను 1.5 లక్షలకు పైగా అధికారులు దర్యాప్తు చేసి, వాటిపై చర్యలు తీసుకున్నారని పేర్కొంది. అయితే, అధికారులందరూ ఒక చట్టపరమైన చట్రం,సబలమైన ప్రక్రియలో పనిచేస్తున్నారని వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఈసీపై ఆరోపణలు చేశారు. కాగా.. ఆప్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఆప్ విమర్శలు

ఇకపోతే, భారతీయ జనతా పార్టీ ఎంపీ రమేష్ బిధూరి కుటుంబం ఎన్నికల కోడ్(EC) ని బహిరంగంగా ఉల్లంఘించినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోకుండా విస్మరించిందని అతిషి విమర్శలు చేసింది. తాను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ తనపైనే అభియోగాలు మోహింపదని చెప్పుకొచ్చారు. : “రిటైర్ అవ్వబోతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో?” అని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రశ్నించారు. ఎన్నికల సంఘం (Election Commission) పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎదుట ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ తన ఉనికిని కోల్పోయినట్లు ఉందన్నారు. కాగా.. ఈ విమర్శలపైనే ఆప్ స్పందించింది. ఇకపోతే, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.

Next Story