Sweden: స్వీడన్‌లో కాల్పులు..10 మంది మృతి

by B.Srinivas |

స్వీడన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒరెబ్రో నగరంలోని ఓ వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు.

Sweden: స్వీడన్‌లో కాల్పులు..10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వీడన్‌ (Sweden)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒరెబ్రో నగరంలోని ఓ వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. రాజధాని స్టాక్‌హోమ్‌ (Stock home)కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిస్‌బర్గ్స్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 1గంటల ప్రాంతంలో దుండగుడు కాల్పులు జరిపినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న టైంలో ఘటన జరిగింది. ఈ విషయాన్ని స్వీడన్ పోలీసులు సైతం ధ్రువీకరించారు. కాల్పులు జరిపింది నిందితుడు ఒక్కడేనని, ఈ సంఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉందని భావించడం లేదని తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో అధికారికంగా ధ్రువీకరించలేదు. కాల్పులతో ఉపాధ్యాయుడు, విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు. స్వీడన్ చరిత్రలో విచారకరమైన రోజని తెలిపారు. ఇది ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిగా దీనిని అభివర్ణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story