- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సువేందు అధికారి పీఏ హత్య
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి పీఏ చంద్రను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తాజాగా బీజేపీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సలహాదారుడు చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాల జిల్లా మధ్యామ్ గ్రామ్ లో కారులో వెళ్తుండగా చంద్రనాథ్ పై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. బైక్ పైన వచ్చి, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు చంద్రనాథ్. ఈ సంఘటనలో బుద్ధదేవ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన దుండగులను వెతికే పనిలో పడ్డారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పైన భవానిపూర్ లో సువేందు అధికారి విజయం సాధించాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో కూడా సువేందు అధికారి ఉన్న తరుణంలో ఈ హత్య జరగడం రాజకీయ కుట్ర అని అనుమానాలకు తావిస్తోంది.






