బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

by Malleboina Mahesh |   (  Updated:2026-05-09 06:59:21  IST  )

సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు.

బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ (BJP) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి (Governor BN Ravi.).. సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం (Oath taking) చేయించారు. అనంతరం ఆయన ఫైలుపై సంతకం చేసి.. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, సీఎం యోగీ, స్టేజీపై ఉన్న ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి సువేందు అధికారి బీజేపీ మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అలాగే ఇదే వేదికపై ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, పలువురు కేబినెట్ మంత్రులు సైత్తం ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story