పక్కా ప్లాన్‌తోనే నా పీఏను చంపారు: సువేందు అధికారి

by velandi.Saikiran |

త‌న పీఏ చంద్రను రెండు నుంచి మూడు రోజులు రెక్కీ నిర్వహించి, నిందితులు ఈ హత్య చేసినట్లు సువేందు అధికారి వెల్లడించారు.

పక్కా ప్లాన్‌తోనే నా పీఏను చంపారు: సువేందు అధికారి
X

దిశ‌, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ‌బీజేపీ నాయకుడు సువేందు అధికారి పీఏ చంద్రను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం సాయంత్రం ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మధ్యగ్రామ్ సమీపంలో హత్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే, ఈ సంఘ‌ట‌న‌పై తాజాగా షాకింగ్ ఆరోప‌ణ‌లు చేశారు సువేందు అధికారి. పక్కా ప్లాన్‌తోనే నా పీఏను చంపారని సీరియ‌స్ అయ్యారు. రెండు నుంచి మూడు రోజులు రెక్కీ నిర్వహించి, నిందితులు ఈ హత్య చేసినట్లు డీజీపీ తనకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇది టీఎంసీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు నిదర్శనమని పడ్డారు. త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తామని కూడా ప్రకటన చేశారు సువేందు అధికారి. కాగా పీఏ చంద్ర హత్య వెనక మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో లేకున్నా తమ‌దే రాజ్యమని చెప్పేందుకు ఇలా చేశారని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారి, సీఎం రేసులో ఉన్న‌ట్లు స‌మాచారం.

Next Story