24 గంటల్లో TMC అంతమైపోతుంది : సువేందు

by velandi.Saikiran |   (  Updated:2026-05-04 21:00:35  IST  )

24 గంటల్లో TMC అంతమైపోతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సువేందు.

24 గంటల్లో TMC అంతమైపోతుంది : సువేందు
X

దిశ‌, వెబ్ డెస్క్: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. 24 గంటల్లో TMC పార్టీ నాశనం అయిపోతుందన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిపోయిన ఆ పార్టీ... కొందరు గుండాల అండతోనే నడుస్తోందని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసిందని విమర్శలు చేశారు బీజేపీ నేత సువేందు అధికారి.. ఇకపై పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పెత్తనం ఎక్కడ సాగకుండా చేస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా నందిగ్రామ్, భవానీ పూర్ లో హిందువులే తనను గెలిపించాలని గుర్తు చేశారు.

Next Story