కరుణానిధి కలలో కూడా అనుకోలేదేమో...

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-05 10:29:06  IST  )

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో స్టార్ హీరో విజ‌య్ పార్టీ టీవీకే విజ‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చగా మారింది. పార్టీని స్థాపించిన రెండేళ్ల‌లో, మొద‌టి సారి బ‌రిలో దిగిన ఎన్నిక‌ల్లోనే టీవీకే విజ‌యం సాధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

కరుణానిధి కలలో కూడా అనుకోలేదేమో...
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో స్టార్ హీరో విజ‌య్ పార్టీ టీవీకే విజ‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చగా మారింది. పార్టీని స్థాపించిన రెండేళ్ల‌లో, మొద‌టి సారి బ‌రిలో దిగిన ఎన్నిక‌ల్లోనే టీవీకే విజ‌యం సాధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆ పార్టీ 107సీట్ల‌ను కైవ‌సం చేసుకోగా మెజారిటీ ద‌క్కాలంగా 118 సీట్లు రావాల్సి ఉంది. దీంతో మిగితా 11 సీట్ల కోసం విజ‌య్ కాంగ్రెస్, ఇత‌ర పార్టీల అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా విజ‌య్ సీఎం అవ్వ‌డం దాదాపు ఖాయం అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 7న విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు కూడా స‌మాచారం అందుతోంది.

ఈ క్ర‌మంలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దివంగ‌త సీఎం క‌రుణానిధి త‌న వెనుక నిల‌బ‌డిన కుర్రాడే త‌న పార్టీని నాశనం చేస్తాడ‌ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌ర‌ని ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో క‌రుణానిధి రిబ్బ‌న్ క‌ట్ చేస్తుంటే ఆయ‌న వెన‌కాల విజ‌య్ నిల‌బ‌డి న‌వ్వుతూ ఉన్నాడు. ఆర్జీవీ ట్వీట్ వైర‌ల్ అవ్వ‌డంతో విజయ్ కేవ‌లం డీఎంకే పార్టీని మాత్రమే నాశ‌నం చేయ‌లేద‌ని.. క‌రుణానిధి కుమారుడి రాజకీయ‌జీవితాన్ని సైతం నాశ‌నం చేశాడ‌ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్టాలిన్ ఇప్పటి నుండి ప్రతిరోజు రాత్రి విజయ్ గురించే కలలు కంటాడని ఎద్దేవా చేశాడు.

Next Story