సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ కన్నుమూత

by Gantepaka Srikanth |

సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ కన్నుమూత

సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ భర్త కౌశల్(Swaraj Kaushal Passes Away) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా, స్వరాజ్ కౌశల్ 1952 జులై 12వ తేదీన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్‌లో జన్మించారు. 1990 నుంచి 1993 మధ్య కాలంలో ఆయన మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. స్వరాజ్ కౌశల్ భార్య సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6వ తేదీన ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వరాజ్ కౌశల్ మరణవార్త విని బీజేపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story