Dasara Air Show: విజయదశమి వేడుకలు.. మైసూరులో దసరా ఎయిర్ షోలో సూర్యకిరణ్ విన్యాసాలు

by Ramesh Naini |   (  Updated:2025-10-02 04:16:41  IST  )

కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.

Dasara Air Show: విజయదశమి వేడుకలు.. మైసూరులో దసరా ఎయిర్ షోలో సూర్యకిరణ్ విన్యాసాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని (Mysore) మైసూరులో దసరా ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు.. చివరి రోజున ప్రసిద్ది చెందిన జంబూ సవారి అనే భారీ ఊరేగింపు, టార్చ్‌లైట్ పరేడ్ వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జంబూ సవారి ఊరేగింపులో అలంకరించబడిన ఏనుగులు, రాజవంశం ప్రతినిధులు, ప్రజలు పాల్గొంటారు. టార్చ్‌లైట్ పరేడ్‌తో దసరా వేడుకలను ముగిస్తారు. అలాగే బుధవారం నిర్వహించిన దసరా ఎయిర్ షోలో (Indian Air Force) భారత వైమానిక దళానికి చెందిన (Surya Kiran Aerobatic Team) సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ (SKAT) అద్భుతమైన గగన విన్యాసాలతో ప్రేక్షకులను అలరించింది.

మైసూరు ప్యాలెస్‌పై సాహసోపేతమైన వైమానిక ప్రదర్శనలు చేస్తూ, జెట్ విమానాలతో ఆకాశంలో వివిధ ఆకృతులను చూపించి సందర్శకులను ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాది జరిగే దసరా ఉత్సవాల్లో భాగంగా ఎయిర్ షో ప్యాలెస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించింది. సూర్య కిరణ్ బృందం చూపిన విన్యాసాలు, వేగవంతమైన మలుపులు, చేసిన గగనతల ప్రదర్శనలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story