Supreme Court: SC వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

by GSrikanth |   (  Updated:2022-08-10 09:21:05  IST  )

Supreme Court Issues Notice to Centre Over SC Classifications| ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్గీకరణకు

Supreme Court Issues Notice to Centre Over SC Classifications
X

దిశ, వెబ్‌డెస్క్: Supreme Court Issues Notice to Centre Over SC Classifications| ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

విచారణ అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ లేకపోవడంతో రెండు దశాబ్దాలుగా నష్టపోతున్నామని అన్నారు. వర్గీకరణపై కేంద్ర రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల వైఖరి తెలుసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉప కులలాలకు న్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. మంత్రికి తలనొప్పిగా మారిన వైనం..

Next Story