ఆరావళి రక్షణ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కొత్త నిపుణుల కమిటీ ఏర్పాటు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-29 07:42:00  IST  )

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆరావళి రక్షణ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కొత్త నిపుణుల కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆరావళి పర్వత శ్రేణుల (Aravali mountain ranges) పరిరక్షణ పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) నేతృత్వంలోని ధర్మాసనం, ఆరావళి పర్వతాల నిర్వచనం (Definition of Aravallis), వాటికి సంబంధించి తలెత్తుతున్న వివాదాస్పద అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఒక కొత్త నిపుణుల కమిటీని (New Expert Committee) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పర్యావరణ పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వత శ్రేణుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఆక్రమణలను అరికట్టడమే లక్ష్యంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణ చేపడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల స్పందనను కోరుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పర్వత శ్రేణుల సరిహద్దులను శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే భూ వివాదాలకు అడ్డుకట్ట వేయాలని ధర్మాసనం భావిస్తోంది.

పాత నిర్వచనం నిలిపివేత!

ఆరావళి పర్వతాలు, పర్వత శ్రేణుల నిర్వచనంపై సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఆరావళి నిర్వచనాన్ని అంగీకరిస్తూ గతంలో (నవంబర్ 20న) ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ (Abeyance) చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ నాటి నిర్ణయం అమలులోకి వస్తే, ఆరావళి ప్రాంతంలో మెజారిటీ భాగం మైనింగ్ కార్యకలాపాలకు అనుకూలంగా మారుతుందని పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Next Story