- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
నీట్ పరీక్ష విధానం మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇప్పటికే పరీక్ష రద్దు పరిణామాలతో ఏజెన్సీ సతమతం అవుతున్న సమయంలో పరీక్షా ప్రక్రియను మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష విధానం మార్పుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇప్పటికే పరీక్ష రద్దు పరిణామాలతో ఏజెన్సీ సతమతం అవుతున్న సమయంలో పరీక్షా ప్రక్రియను మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించాలి అంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తూ పేపర్ పెన్ ఫార్మాట్ లోనే నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను సవరించాలని కోరుతూ రాష్ట్రీయ జనతా ధళ్ శాసనసభ్యుడు సుధాకర్ సింగ్ ఇటీవల వేసిన పిటిషన్ పై జస్టిస్ పీఎస్ నరసిహ, అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసన విచారణ జరిపింది. కాగా తిరిగి పరీక్ష నిర్వహిస్తుండటంతో సమయం తక్కువ ఉండటం, ఏజెన్సీపై ఒత్తిడి కారణంగా పరీక్ష ప్రక్రియ మార్చకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పేపర్ లీకేజీ ఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం, ఏజెన్సీ తీసుకున్న చర్యలపై వివరణాత్మక అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పేపర్ పెన్ విధానంలో మరోసారి నీట్ పరీక్షను నిర్వహించనున్నారు.






