- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాగ్ లవర్స్ కు సుప్రీంకోర్ట్ బిగ్ షాక్
కుక్కల ప్రేమికులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పసిపిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల రక్షణ చర్యలు ముఖ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కుక్కల ప్రేమికులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పసిపిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల రక్షణ చర్యలు ముఖ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ, నోయిడా ప్రాంతంలో తిరిగే వీధి కుక్కలను వెంటనే ఆనిమల్ షెల్టర్లకు తరలించాలని, స్టెరిలైజేషన్ అనంతరం కూడా వాటిని జనావాస ప్రాంతాల్లో విడుదల చేయరాదని ఆదేశించింది. అయితే ఇ నిర్ణయంపై కొంతమంది జంతుప్రేమికులు పిటిషన్ దాఖలు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్లపై మండిపడింది.
'మీ జంతు ప్రేమికులు కుక్కలు దాడిలో, రేబీస్ తో చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకు రాగలరా' అంటూ ఫైర్ అయింది. హైకోర్టు ఆదేశాల అమలులో జోక్యం చేసుకునే వ్యక్తులపై నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే వీధి కుక్కల బెడద ఒక్క ఢిల్లీ నగరానికే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వేల సంఖ్యలో వీధి కుక్కలు మనుషులను హడలెత్తిస్తుంటాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులను పీక్కుతిన్న సంఘటనలు కోకొల్లలు.
దేశంలో ప్రతియేటా 20 నుంచి 30 లక్షల మంది కుక్కకాటు బాధితులు ఉండగా... వారిలో దాదాపు 6 వేల మంది వరకు రేబీస్ బారిన పడి అత్యంత దారుణ స్థితిలో ప్రాణాలు విడుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ, అంతిమంగా మనుషుల ప్రాణాలు కాపాడటం ముఖ్యం కాబట్టి, సుప్రీం తీర్పును ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.






