- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు?
హిందూ మతానికి సంబంధించిన ట్రస్టుల్లో ముస్లింలను భాగం చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ మతానికి సంబంధించిన ట్రస్టుల్లో ముస్లింలను భాగం చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme court) ప్రశ్నించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నుంచి ముస్లింలను కూడా హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో భాగం చేసుకోవడానికి అనుమతిస్తానని మీరు చెబుతున్నారా? అలా అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పండి’ అని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వక్ఫ్ చట్టానికి తీసుకువచ్చిన మార్పుల ద్వారా ప్రభుత్వం గత చరిత్రను రద్దు చేయలేదని తెలిపింది. చాలా కాలం క్రితం వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డీ-నోటిఫై చేయడానికి కొత్త చట్టం కింద ఉన్న పరిధిని ధర్మాసనం ప్రస్తావిస్తూ.. 200 ఏళ్ల క్రితం ఒక పబ్లిక్ ట్రస్ట్‌ను వక్ఫ్‌గా ప్రకటించినప్పుడు.. అకస్మాత్తుగా దానిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఎలా చెబుతారని నిలదీసింది.
వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దు
కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను విచారణ సమయంలో డీ-నోటిఫై చేయొద్దని ధర్మాసనం తెలిపింది. జిల్లా కలెక్టర్ దర్యాప్తులో ఉన్నప్పుడు ఆస్తులను వక్ఫ్‌గా పరిగణించకుండా నిరోధించే నిబంధనను కూడా నిలిపివేసింది. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. ఇందులో ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు. చాలా కాలంగా అక్కడ ఉన్న వక్ఫ్ బై యూజర్‌లను మీరు ఎలా నమోదు చేస్తారు? వారి వద్ద ఏ పత్రాలు ఉంటాయి? అది ఏదో ఒక ఆందోళనకు దారితీస్తుంది’ అని పేర్కొంది. ‘14వ,16వ శతాబ్దాల నాటి మసీదులు ఉన్నాయి. వాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లు ఉండవు. అలాంటి ఆస్తులను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని’ ప్రశ్నించింది. అలాంటి వక్ఫ్ తిరస్కరణకు గురైతే వివాదం చాలా కాలం పాటు కొనసాగుతుందని నొక్కి చెప్పింది.
నిరసనలు ఆందోళనకరం
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేసింది. ఈ అల్లర్లు చాలా ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిగణనలో ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి హింసను ఎంచుకోవద్దని సూచించింది. అయితే పిటిషనర్లు కోరినట్టు వక్ప్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది. వక్ఫ్ సవరణలపై ఉన్న వివాదాలపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం మరోసారి విచారించనుంది.






