Supreme court: విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు.. జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు ఫైర్

by B.Srinivas |

అంతర్గత దర్యాప్తు కమిటీ నివేదికను సవాల్ చేస్తూ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Supreme court: విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు.. జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: తన ఇంట్లో నగదు రికవరీ కేసులో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలిన అంతర్గత దర్యాప్తు కమిటీ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwanth varma) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యశ్వంత్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని, విచారణ కమిటీ ప్రక్రియపై అభ్యంతరం ఉంటే దర్యాప్తు సమయంలోనే ఎందుకు సవాల్ చేయలేదని, కమిటీ ఎదుట ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించింది. అంతర్గత విచారణ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండాల్సిందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తి దోషి అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భావిస్తే ఆయన ఆ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి తెలియజేయొచ్చని స్పష్టం చేసింది. సీజేఐ అంటే పోస్టాఫీసు కాదని, ఆయనకు దేశం పట్ల కూడా బాధ్యత ఉందని తెలిపింది. ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు నివేదికలోని వాస్తవాలపై కాకుండా రాజ్యాంగ అంశాలపై చర్చించాలని సూచించింది.

కాగా, జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న టైంలో ఆయన ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంలచనం రేపింది. దీంతో అప్పుడు సీజేఐగా ఉ్న సంజీవ్ ఖన్నా ఘటనపై అంతర్గత విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేపట్టిన కమిటీ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. ఈ క్రమంలోనే వర్మ రాజీనామా చేయాలని సూచించడంతో పాటు, అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story