- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమాలుంటే ఎస్ఐఆర్ రద్దు చేస్తాం.. ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక
by Phanindra |
అక్రమాలుంటే ఎస్ఐఆర్ రద్దు చేస్తామని ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఈ అంశంపై తుది వాదనలను అక్టోబర్ 7న వింటామని తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు ఉన్నట్లు తేలితే మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎస్ఐఆర్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎంచుకున్న విధానంలో ఎలాంటి సమస్యలున్నా ఇదే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లపై విచారణ సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్జీతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ.. ఈ విషయంలో చట్టబద్ధమైన, తప్పనిసరి నియమనిబంధనలన్నీ అమలు చేసిందని తాము భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఒక్క బిహార్‌కు సంబంధించే తీర్పు ఇవ్వబోమని, తమ నిర్ణయం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ చట్టబద్ధతపై అక్టోబర్ 7వ తేదీన తుది వాదనలు వింటామని ప్రకటించింది.
Next Story






