- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుమారం రేపుతున్న "వీధి కుక్కలపై సుప్రీం తీర్పు"... డాగ్ లవర్స్ భారీ నిరసన
పసిపిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల రక్షణ చర్యలు ముఖ్యం కాదని, మీ జంతు ప్రేమికులు రేబిస్ తో చనిపోయిన వారి ప్రాణాలను వెనక్కి తీసుకురాగలరా అని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పసిపిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల రక్షణ చర్యలు ముఖ్యం కాదని, మీ జంతు ప్రేమికులు రేబిస్ తో చనిపోయిన వారి ప్రాణాలను వెనక్కి తీసుకురాగలరా అని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తక్షణమే వీధి కుక్కలను ఆనిమల్ షెల్టర్లకు తరలించాలని, స్టెరిలైజేషన్ అనంతరం కూడా వాటిని జనావాస ప్రాంతాల్లో విడుదల చేయరాదని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు చేస్తున్న తప్పులకు నోరు లేని మూగజీవాలు ఎందుకు శిక్షకు గురి కావాలని న్యాయస్థానం తీర్పును ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా సుప్రీం తీర్పును నిరసిస్తూ సోమవారం రాత్రి ఢిల్లీ వీధుల్లో భారీ నిరసన ర్యాలీ చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం మనుషులతో పాటు జంతువులకు కూడా జీవించే హక్కు ఉంటుందని, అధికారులు చేసిన తప్పుకు కుక్కలు ఎందుకు బలి కావాలని ఆందోళన చేశారు.
అయితే వీధి కుక్కల బెడద ఒక్క ఢిల్లీ నగరానికే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వేల సంఖ్యలో వీధి కుక్కలు మనుషులను హడలెత్తిస్తుంటాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులను పీక్కుతిన్న సంఘటనలు కోకొల్లలు. దేశంలో ప్రతియేటా 20 నుంచి 30 లక్షల మంది కుక్కకాటు బాధితులు ఉండగా... వారిలో దాదాపు 6 వేల మంది వరకు రేబీస్ బారిన పడి అత్యంత దారుణ స్థితిలో ప్రాణాలు విడుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ, అంతిమంగా మనుషుల ప్రాణాలు కాపాడటం ముఖ్యం కాబట్టి, సుప్రీం తీర్పును ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నవారు కూడా ఉన్నారు.






