- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు – ‘దయారహిత నిర్ణయమని విమర్శించిన ననితా శర్మ
వీధి కుక్కల పై హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై పిటిషనర్, సుప్రీంకోర్టు న్యాయవాది ననితా శర్మ స్పందిస్తూ, “ఈరోజు ఇచ్చిన ఆదేశాలు ఆగస్టు 11 ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా ఉన్నాయంది.

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కల పై సుప్రీంకోర్టులో నమోదైన పిటిషన్ పై విచారించిన కోర్టు.. ఢిల్లీలతో పాటు NCR ప్రాంతాల్లో వీధి కుక్కల తరలింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ ప్రత్యేక డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని, స్కూల్స్, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆస్పత్రుల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటుగా వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని, నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వీధి కుక్కల పై హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో పిటిషనర్, సుప్రీంకోర్టు న్యాయవాది ననితా శర్మ స్పందిస్తూ, “ఈరోజు ఇచ్చిన ఆదేశాలు ఆగస్టు 11 ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా ఉన్నాయి. ప్రభుత్వ, విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్‌లు వంటి ప్రదేశాల నుంచి కుక్కలను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు” అని వెల్లడించారు. “ఈ జంతువులు తిరిగి ఆ సంస్థల్లోకి రాకుండా పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారి నియమించనున్నారు. కానీ నేను ఇంకా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంచుతున్నాను. ఇంత దయా రహితంగా ప్రాణం లేని జంతువులపై అన్యాయం జరగకూడదు. ABC (Animal Birth Control) నియమాల ప్రకారం కుక్కల తరలింపు అనేది నిషేధం. కానీ కుక్క కాటు ఘటనలను కారణంగా చూపి దీన్ని సమర్థిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం,” అని ననితా శర్మ వ్యాఖ్యానించారు.“ఇది సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి గౌరవిస్తున్నాం. కానీ దీని వల్ల జంతువులకు హాని కలగకూడదు” అని ఆమె ఈ సందర్భంగా మీడియాతో కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చారు.






