- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)కు రాష్ట్ర కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువరం సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ జరిపింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)కు రాష్ట్ర కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువరం సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ జరిపింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. పెహల్గాం ఘటనను ఎవరూ విస్మరించలేరని పేర్కొంది. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది అని పిటిషన్‌లో పేర్కొన్నారు.






